భారత్‌లో తొలి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ రూపకల్పన
Sakshi Education
దేశంలో తొలి ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ సెలెస్ట్రియల్ ఈ-మొబిలిటీ రూపొందించింది.
వినియోగానికి వీలున్న నమూనాను మార్చి 11న హైదరాబాద్‌లో ఆవిష్కరించింది. ఉద్యానవనాలు, విమానాశ్రయాలు, ఫ్యాక్టరీలు, గిడ్డంగుల్లో సరుకు రవాణాకు వీలుగా 6 హెచ్‌పీ సామర్థ్యంతో ఈ ట్రాక్టర్‌ను తయారు చేశారు. 21 హెచ్‌పీ డీజిల్ ట్రాక్టరుకు సమానంగా ఇది పనిచేస్తుందని కంపెనీ సహ వ్యవస్థాపకుడు సిద్ధార్థ దురైరాజన్ తెలిపారు.
నోవా ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ లిమిటెడ్‌కు శంకుస్థాపన
టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ అనుబంధ వైమానిక, రక్షణ సంస్థ నోవా ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ లిమిటెడ్(ఎన్‌ఐఎస్‌ఎల్)కు తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె. తారక రామారావు మార్చి 13న హైదరాబాద్‌లో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఎన్‌ఐఎస్‌ఎల్ భారతీయ సైన్యం కోసం మొబైల్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్, మొబైల్ వీశాట్ కమ్యూనికేషన్ షెల్టర్లు, రాడార్ మైక్రోవేవ్ కాంపోనెంట్ తయారీ, ఎలక్టో్ర ఆప్టిక్స్, ఎలక్టాన్రిక్స్ తయారీ, అభివృద్ధి, పరిశోధన, ప్రోటోటైపింగ్ ప్రాజెక్టులను చేపట్టడం అభినందనీయమన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్‌లో తొలి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ రూపకల్పన
ఎప్పుడు : మార్చి 11
ఎవరు : సెలెస్ట్రియల్ ఈ-మొబిలిటీ
ఎక్కడ : హైదరాబాద్

Published date : 13 Mar 2020 05:34PM