Skip to main content

భారత్‌లో రిటైల్‌ బ్యాంకింగ్‌కు వీడ్కోలు పలికిన బ్యాంక్‌?

భారత్‌లో క్రెడిట్‌ కార్డులు, గృహ రుణాలు తదితర కన్జూమర్‌ బ్యాంకింగ్‌ వ్యాపార కార్యకలాపాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు అమెరికన్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం సిటీబ్యాంక్‌ ఏప్రిల్‌ 15న ప్రకటించింది.
Current Affairs
అంతర్జాతీయ ప్రణాళికల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దాదాపు శతాబ్దం క్రితం 1902లో సిటీబ్యాంక్‌.. భారత్‌లో అడుగుపెట్టింది. 1985 నుంచి కన్సూమర్‌ బ్యాంకింగ్‌ వ్యాపారం నిర్వహిస్తోంది.

ఏవియేషన్‌ అకాడమీతో బోయింగ్‌ జట్టు
విమాన తయారీ దిగ్గజం బోయింగ్‌ తాజాగా ఇండియన్‌ ఏవియేషన్‌ అకాడమీ, యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం... దేశీయ విమానయాన రంగంలోని భాగస్వాములకు సేఫ్టీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌పై శిక్షణ ఇస్తారు. ఇంటర్నేషనల్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆర్గనైజేషన్‌ ప్రకారం... వాణిజ్య వైమానిక సేవల కంపెనీలు, విమానాశ్రయాలు, ఎయిర్‌ ట్రాఫిక్‌ సర్వీసులకు సేఫ్టీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ అవసరం ఉంది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : రిటైల్‌ బ్యాంకింగ్‌కు వీడ్కోలు పలికిన బ్యాంక్‌?
ఎప్పుడు : ఏప్రిల్‌ 15
ఎవరు : అమెరికన్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం సిటీబ్యాంక్‌
ఎక్కడ : భారత్‌
ఎందుకు : అంతర్జాతీయ ప్రణాళికల్లో భాగంగా...
Published date : 17 Apr 2021 04:38PM

Photo Stories