భారత్‌లో పెట్టుబడులకు ఇన్వెస్టర్ మ్యాప్‌ను ఆవిష్కరించిన ఐరాస సంస్థ?
Sakshi Education
భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన విభాగాలకు సంబంధించి... ఇన్వెస్ట్ ఇండియా, యునెటైడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (యూఎన్‌డీపీ) సంయుక్తంగా ‘ఎస్‌డీజీ ఇన్వెస్టర్ మ్యాప్’ను నవంబర్ 20న ఆవిష్కరించాయి.
స్థిరమైన అభివృద్ధిని సాధించాలన్న లక్ష్యాలు నిర్దేశించుకున్న (ఎస్‌డీజీ)లో... ఆరు రంగాల్లో పెట్టుబడులకు ఆస్కారమున్న 18 విభాగాలను (ఐవోఏ) పొందుపర్చారు. విద్య, వైద్యం, వ్యవసాయం.. అనుబంధ కార్యకలాపాలు, ఆర్థిక సేవలు మొదలైనవి ఈ ఆరు రంగాల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఇన్వెస్ట్ ఇండియా ఎండీగా దీపక్ బాగ్లా ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎస్‌డీజీ ఇన్వెస్టర్ మ్యాప్ఆవిష్కరణ
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : ఇన్వెస్ట్ ఇండియా, యునెటైడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (యూఎన్‌డీపీ)
ఎందుకు : భారత్‌లో పెట్టుబడులకు సంబంధించి...
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎస్‌డీజీ ఇన్వెస్టర్ మ్యాప్ఆవిష్కరణ
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : ఇన్వెస్ట్ ఇండియా, యునెటైడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (యూఎన్‌డీపీ)
ఎందుకు : భారత్‌లో పెట్టుబడులకు సంబంధించి...
Published date : 21 Nov 2020 05:52PM