భారత్‌లో పాక్ వైమానిక దాడులు
Sakshi Education
జమ్మూకశ్మీర్‌లోని నౌషెరా, పూంచ్ సెక్టార్లలో పాకిస్తాన్ వైమానిక దాడులకు పాల్పడింది.
భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా ఫిబ్రవరి 27న దాడులకు తెగబడటంతో భారత బలగాలు పాక్ వాయుసేనను దీటుగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో పాక్ ఫైటర్ జెట్ ఎఫ్-16ను గాల్లోనే కూల్చివేశాయి. పాక్ యుద్ధ విమానాలను వెంటాడుతూ నియంత్రణ రేఖను దాటిన రెండు భారత వాయుసేనకు చెందిన యుద్ధవిమానానాన్ని పాక్ కూల్చివేసింది. అలాగే ఒక పైలట్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పాక్ తెలిపింది. అదుపులోకి తీసుకున్న పైలట్ అభినందన్‌ను సురక్షితంగా విడుదల చేయాలని, ‘జెనీవా’ నిబంధనల ప్రకారం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని పాక్‌కు భారత్ సూచించింది. రెండు అణ్వాయుధ దేశాల మధ్య తలెత్తిన తాజా పరిస్థితిపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పాకిస్తాన్ వైమానిక దాడులు
ఎప్పుడు : ఫిబ్రవరి 27
ఎక్కడ : నౌషెరా, పూంచ్ సెక్టార్లు, జమ్మూకశ్మీర్
క్విక్ రివ్యూ :
ఏమిటి : పాకిస్తాన్ వైమానిక దాడులు
ఎప్పుడు : ఫిబ్రవరి 27
ఎక్కడ : నౌషెరా, పూంచ్ సెక్టార్లు, జమ్మూకశ్మీర్
Published date : 28 Feb 2019 05:07PM