భారత్‌లో ఎఫ్‌డీఐల్లో విషయంలో అమెరికా స్థానం?
Sakshi Education
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్)లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) రూపంలో భారత్‌లో అత్యధికంగా ఇన్వెస్ట్ చేసిన దేశాల జాబితాలో మారిషస్‌ను తోసిరాజని అమెరికా రెండో స్థానానికి చేరింది.
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ గణాంకాల ప్రకారం అమెరికా నుంచి 7.12 బిలియన్ డాలర్లు వచ్చాయి. ఇప్పటిదాకా రెండో స్థానంలో ఉన్న మారిషస్ 2 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలతో నాలుగో స్థానానికి పడిపోయింది. గతేడాది ఇదే వ్యవధిలో మారిషస్ రెండో స్థానంలో, అమెరికా నాలుగో స్థానంలో ఉంది. తాజాగా 8.3 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో సింగపూర్ అగ్రస్థానంలో నిల్చింది. 2.1 బిలియన్ డాలర్లతో కేమ్యాన్ ఐల్యాండ్‌స మూడో స్థానంలో ఉంది. అమెరికా నుంచి ఎఫ్‌డీఐలు పెరగడమనేది ఇరు దేశాల మధ్య ఆర్థిక బంధాలు మరింత పటిష్టం అవుతుండటాన్ని సూచిస్తోందని నిపుణులు పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎఫ్‌డీఐల్లో 7.12 బిలియన్ల పెట్టుబడులు
ఎవరు : అమెరికా
ఎన్నో స్థానం : రెండు
Published date : 30 Nov 2020 05:02PM