భారత్‌లో చైనా రాయబారిగా వీడాంగ్
Sakshi Education
భారత్‌లో తమ కొత్త రాయబారిగా సీనియర్ దౌత్యవేత్త సున్ వీడాంగ్‌ను చైనా ప్రభుత్వం నియమించింది.
భారత్‌లో చైనా రాయబారిగా ఉన్న లో జుహుయీనిని విదేశాంగశాఖ సహాయమంత్రిగా నియమించింది. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ 2009-13 మధ్యకాలంలో చైనాలో భారత రాయబారిగా పనిచేసిన కాలంలో వీడాంగ్‌తో ఆయనకు మంచి అనుబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే చైనా విదేశాంగశాఖ పాలసీ-ప్రణాళికా విభాగంలో డెరైక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న వీడాంగ్‌ను భారత్‌లో తమ రాయబారిగా చైనా నియమించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్‌లో చైనా రాయబారి నియామకం
ఎప్పుడు : జూన్ 12
ఎవరు : సున్ వీడాంగ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్‌లో చైనా రాయబారి నియామకం
ఎప్పుడు : జూన్ 12
ఎవరు : సున్ వీడాంగ్
Published date : 13 Jun 2019 05:41PM