భారత్‌లో బిలియన్ డాలర్ల పెట్టుబడి
Sakshi Education
భారత్‌లో వచ్చే మూడేళ్లలో 1 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడి పెట్టనున్నట్లు టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ వెల్లడించింది.
అలాగే 2019 ఏడాది ఆఖరుకి భారత్‌లోని ఉద్యోగుల సంఖ్యను కూడా 1,000కి పెంచుకోనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం 250 మంది ఉద్యోగులున్నట్లు బైట్‌డ్యాన్స్ డెరైక్టర్ (ఇంటర్నేషనల్ పబ్లిక్ పాలసీ) హెలినా లెర్ష్ తెలిపారు. స్వల్ప నిడివి వీడియోలను షేర్ చేసుకునేందుకు ఉపయోగపడే టిక్‌టాక్ యాప్ ద్వారా అశ్లీల వీడియోలు కూడా వ్యాప్తి చెందుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో భారత్‌లో దీన్ని నిషేధించడం తెలిసిందే. దీంతో గూగుల్, యాపిల్ సంస్థలు టిక్‌టాక్‌ను తమ యాప్ స్టోర్స్ నుంచి తొలగించాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్‌లో బిలియన్ డాలర్ల పెట్టుబడి
ఎప్పుడు : ఏప్రిల్ 19
ఎవరు : బైట్‌డ్యాన్స్
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్‌లో బిలియన్ డాలర్ల పెట్టుబడి
ఎప్పుడు : ఏప్రిల్ 19
ఎవరు : బైట్‌డ్యాన్స్
Published date : 20 Apr 2019 05:29PM