భారత్‌లో అమెరికా అధ్యక్షుడి పర్యటన ఖరారు
Sakshi Education
భారత్‌లో అమెరికా అధ్యక్షుడి పర్యటన తేదీలు ఖరారయ్యాయి. 2020 ఫిబ్రవరి 24, 25వ తేదీల్లో భారత్ రానున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యూఢిల్లీ, అహ్మదాబాద్‌ల్లో పర్యటించనున్నారు.
ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ, అమెరికా ప్రభుత్వం ఫిబ్రవరి 11న వెల్లడించాయి. భారత్‌లో ట్రంప్ మొదటిసారిగా జరిపే ఈ పర్యటన ద్వారా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను, ప్రజల మధ్య స్నేహాన్ని మరింత పెంచుతాయని అమెరికా తెలిపింది. ఈ పర్యటనలో ట్రంప్ వెంట ఆయన భార్య మెలానియా ట్రంప్ కూడా ఉంటారని పేర్కొంది.
ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ట్రంప్, భారత ప్రధాని మోదీ ద్వెపాక్షిక సంబంధాల ప్రగతిని సమీక్షించడంతోపాటు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విసృ్తతం చేసుకునేందుకు కృషి చేస్తారని భారత్ తెలిపింది. ట్రంప్ కంటే ముందు 2010-2015 సంవత్సరాల మధ్య అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ఒబామా భారత్‌లో పర్యటించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్‌లో అమెరికా అధ్యక్షుడి పర్యటన
ఎప్పుడు : 2020 ఫిబ్రవరి 24, 25
ఎవరు : డొనాల్డ్ ట్రంప్
ఎక్కడ : న్యూఢిల్లీ, అహ్మదాబాద్
ఎందుకు : ద్వెపాక్షిక సంబంధాల ప్రగతిని సమీక్షించడంతోపాటు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విసృ్తతం చేసుకునేందుకు

Published date : 12 Feb 2020 05:58PM