Skip to main content

భారత్‌కు క్షిపణి వ్యవస్థలను అమ్మేందుకు అమెరికా ఆమోదం

భారత్‌కు అత్యాధునిక క్షిపణి నిరోధక రక్షణ వ్యవస్థలను అమ్మేందుకు అమెరికా ఆమోదం తెలిపింది.
లార్జ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇన్‌ఫ్రారెడ్ కౌంటర్‌మెజర్స్, సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్స్‌గా పిలిచే ఈ వ్యవస్థల అమ్మకానికి సంబంధించి అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు అమెరికా డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ ఫిబ్రవరి 7న తెలిపింది. సుమారు రూ.1,355 కోట్లు విలువైన ఈ రెండింటి కొనుగోళ్ల ద్వారా భారత రాష్ట్రపతి, ప్రధాని ప్రయాణించే విమానాలకు అత్యంత పటిష్టమైన రక్షణ వ్యవస్థ అందుబాటులోకి రానుంది.

భారత రాష్ట్రపతి, ప్రధాని ప్రయాణించే ఎయిరిండియా వన్ విమానాలకు ఈ ఆధునిక వ్యవస్థలను అమర్చితే అమెరికా అధ్యక్షుడి ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంతో సమానమైన పటిష్టమైన భద్రత కలుగుతుంది. ఈ వ్యవస్థలను అమర్చేందుకు 2 బోయింగ్-777 ఈఆర్ విమానాలను ఎయిరిండియా నుంచి కొననున్నారు. ప్రమాద సమయంలో మధ్యశ్రేణి క్షిపణి వ్యవస్థలపై దానంతటదే ప్రతిదాడి చేయడం ఈ వ్యవస్థ ప్రత్యేకతల్లో ఒకటి. ఈ కొనుగోళ్లలో ప్రధాన కాంట్రాక్టర్ గా బోయింగ్ కంపెనీ వ్యవహరించనుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
భారత్‌కు అత్యాధునిక క్షిపణి నిరోధక రక్షణ వ్యవస్థలను అమ్మేందుకు ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : అమెరికా
Published date : 08 Feb 2019 05:48PM

Photo Stories