Skip to main content

భారత్‌కు కోటి డాలర్ల సాయం ప్రకటించిన దేశం?

కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌తో పోరాడుతున్న భారత్‌కు కోటి డాలర్ల సాయం చేయనున్నట్లు <strong>కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడో</strong> ప్రకటించారు.
Current Affairs
కెనడియన్‌ రెడ్‌ క్రాస్‌ సంస్థ నుంచి కోటి డాలర్లను ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సంస్థకు బదిలీచేస్తామని ఏప్రిల్ 28న ప్రధాని ట్రూడో పేర్కొన్నారు. అదనంగా వైద్య ఉపకరణాలు తదితర వైద్య సామగ్రిని అందిస్తామని తెలిపారు. అంతకుముందు భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌తో కెనడా విదేశాంగ వ్యవహారాల మంత్రి మార్క్‌ గర్నీ మాట్లాడారు.

నార్వే 24 లక్షల డాలర్లు...
కోవిడ్‌ సహాయక చర్యల్లో భాగంగా భారత్‌ కోసం పది లక్షల న్యూజిలాండ్‌ డాలర్ల(దాదాపు 7,20,365 అమెరికా డాలర్లు) ఆర్థిక సాయం చేయనున్నట్లు న్యూజిలాండ్‌ ప్రకటించింది. ఈ మొత్తాన్ని భారత్‌లో సహాయక చర్యల్లో వినియోగించే నిమిత్తం ‘ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ది రెడ్‌క్రాస్‌’కుబదిలీచేస్తామని తెలిపింది. భారత్‌కు అదనంగా 400 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను పంపుతున్నట్లు బ్రిటన్‌ వెల్లడించింది. నార్వే 24 లక్షల డాలర్ల సాయం చేసేందుకు ముందుకొచ్చింది. నార్వే 24 లక్షల డాలర్ల సాయం చేసేందుకు ముందుకొచ్చింది.మరోవైపుథాయ్‌ల్యాండ్‌లోని బ్యాంకాక్‌ నుంచి భారత్‌కు నాలుగు ఆక్సిజన్‌ ట్యాంకర్లు చేరుకున్నాయి.

క్విక్ రివ్యూ :

ఏమిటి : భారత్‌కు కోటి డాలర్ల సాయం చేయనున్నట్లు ప్రకటన
ఎప్పుడు : ఏప్రిల్ 28
ఎవరు : కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడో
ఎందుకు :భారత్లో కోవిడ్‌ సహాయక చర్యల కోసం...
Published date : 29 Apr 2021 06:11PM

Photo Stories