భారత్‌కు గూగుల్ భారీ సాయం
Sakshi Education
కరోనాపై పోరులో భారతదేశానికి మద్దతుగా టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ భారీ సాయాన్ని ప్రకటించింది.
భారత్‌కు రూ.113 కోట్లు (15.5మిలియన్ల డాలర్లు) సాయంగా అందిస్తామని జూన్ 17న గూగుల్ తెలిపింది. ముఖ్యంగా హెల్త్ వర్కర్లకు అదనపు శిక్షణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సౌకర్యాల మెరుగు, సుమారు 80 ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం కోసం ఈ నిధులను వినియోగించనున్నట్టు ప్రకటించింది. గివ్ఇండియా, పాత్ సంస్థలకు ఈ నిధులను అందించనుంది. ఈ రెండు సంస్థలు ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణ పనులను పర్యవేక్షిస్తాయి. అలాగే ప్రాజెక్ట్ నిర్వహణ సహాయాన్ని అందిస్తాయి.
కరోనా సంక్షోభంలో విలవిల్లాడిన బాధితులకు సానుభూతి ప్రకటించిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ కష్ట కాలంలో భారతీయులకు సాయం చేసేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని తెలిపారు. కాగా ప్రజారోగ్య సమాచార ప్రచార కార్యక్రమాలు, అత్యవసర సహాయక చర్య కోసం గూగుల్ ఏప్రిల్‌లో రూ .135 కోట్లు సాయం అందించిన సంగతి తెలిసిందే.

Published date : 17 Jun 2021 04:04PM