భారత్‌కు ఎంహెచ్60ఆర్ హెలికాప్టర్లు
Sakshi Education
భారత్‌కు 24 ఎంహెచ్ 60ఆర్ సీహాక్ హెలికాప్టర్లను విక్రయించేందుకు అమెరికా ఏప్రిల్ 3న ఆమోదం తెలిపింది. శత్రు దేశాల సబ్‌మెరైన్లు, నౌకలను ధ్వంసం చేసేందుకు, సముద్రంలో ప్రమాదంలో చిక్కుకున్న వారిని గుర్తించి రక్షించేందుకు వీలుగా ఈ హెలికాప్టర్లను రూపొందించారు.
యుద్ధనౌకలు, విధ్వంసక నౌకలు, క్రూజర్లు, ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ల నుంచి ఈ హెలికాప్టర్లను ప్రయోగించవచ్చు. 24 హెలికాప్టర్లకు మొత్తంగా ధర రూ.1.78 లక్షల కోట్లు ఉంటుందని అంచనా.
సీహాక్ హెలికాప్టర్ల ప్రత్యేకతలు...
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్‌కు సీహాక్ హెలికాప్టర్లను విక్రయించేందుకు ఆమోదం
ఎప్పుడు : ఏప్రిల్ 3
ఎవరు : అమెరికా
సీహాక్ హెలికాప్టర్ల ప్రత్యేకతలు...
- అమెరికాలో ఎంహెచ్ 60ఆర్ సీహాక్ హెలికాప్టర్లను ‘రోమియో’అని కూడా పిలుస్తారు.
- లాక్‌హీడ్ మార్టిన్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ (ఓవిగో) సంస్థ ఈ హెలికాప్టర్లను తయారుచేసింది. 2001, జూలైలో తొలి హెలికాప్టర్ తయారైంది.
- - ఈ హెలికాప్టర్లలో సబ్‌మెరైన్లను ధ్వంసం చేసే పరికరాలతో పాటు సర్చ్, రెస్క్యూ, గన్ సపోర్ట్, నిఘా, సమాచారం చేరవేసే సాంకేతికతను అనుసంధానం చేశారు.
- ఈ హెలికాప్టర్ల ద్వారా సరుకులు, వ్యక్తులను తరలించే వెసులుబాటు ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్‌కు సీహాక్ హెలికాప్టర్లను విక్రయించేందుకు ఆమోదం
ఎప్పుడు : ఏప్రిల్ 3
ఎవరు : అమెరికా
Published date : 04 Apr 2019 06:00PM