Skip to main content

భార‌త్‌కు ఏడీబీ నుంచి రూ.16,500 కోట్లు

కరోనా మహమ్మారిపై పోరుకు భారత్‌కు తోడ్పాటునందించేందుకు ఏషియన్‌ డెవలప్‌మెంట్ బ్యాంక్‌ (ఏడీబీ) రూ.16,500 కోట్లు (220 కోట్ల డాలర్లు) ప్యాకేజీని ఇవ్వనుంది.
Current Affairs

ఈ మేరకు భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఏడీబీ ప్రెసిడెంట్‌ మసత్సు అసకవ తెలిపారు. నిర్మలా సీతారామన్‌తో ఆయన ఏప్రిల్ 10న‌ ఫోన్‌లో మాట్లాడారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం గట్టి ప్రయత్నాలే చేస్తోందని ఆయన ప్రశంసించారు.


ఆరోగ్యరంగానికి తక్షణ సాయం...

భారత అత్యవసరాలను తీర్చడానికి సిద్ధంగా ఉన్నామని ఏడీబీ ప్రెసిడెంట్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆరోగ్య రంగానికి తక్షణ సాయంగా రూ.16,500 కోట్ల ప్యాకేజీని సిద్ధం చేస్తున్నామని, కరోనా కల్లోలంతో కష్టాలు పడుతున్న పేదలు, అసంఘటిత రంగ కార్మికులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలకు, ఆర్థిక రంగానికి కూడా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తక్షణ సాయం, విధానపరమైన రుణాలివ్వడం, బడ్జెట్‌ తోడ్పాటునందించడం... పలు అంశాలపై కసరత్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : భార‌త్‌కు తక్షణ సాయంగా రూ.16,500 కోట్ల ప్యాకేజీ
ఎప్పుడు : ఏప్రిల్ 10
ఎవరు : ఏషియన్‌ డెవలప్‌మెంట్ బ్యాంక్‌ (ఏడీబీ)
ఎందుకు : కరోనా మహమ్మారిపై పోరుకు భారత్‌కు తోడ్పాటునందించేందుకు
Published date : 11 Apr 2020 06:21PM

Photo Stories