Skip to main content

భారత్‌కు అధునాతన గగనతల రక్షణ వ్యవస్థ

భారత్‌కు అత్యంత అధునాతనమైన గగనతల రక్షణ వ్యవస్థను అమెరికా సరఫరా చేయనుంది.
Current Affairsఈ మేరకు 186 కోట్ల డాలర్ల విలువైన ‘సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ’ (ఐఏడీడబ్ల్యూఎస్) విక్రయానికి అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. ఐఏడీడబ్ల్యూఎస్‌ను విక్రయించాలని అమెరికాను భారత్ కోరినట్లు ఆ దేశ ప్రభుత్వం పేర్కొంది. ఐఏడీడబ్ల్యూఎస్ విక్రయంలో భాగంగా ఏఎన్/ఎంపీక్యూ-64ఎఫ్‌ఐ సెంటినెల్ రాడార్ వ్యవస్థ, 118 ఆమ్రామ్ ఏఐఎం-120సి-7/సి-8 క్షిపణులు, 3 ఆమ్రామ్ మార్గనిర్దేశ వ్యవస్థలు, 134 స్టింగర్ క్షిపణులు, ఇతర అధునాతన సెన్సర్లు, సాధనాలు, లాంచర్లు భారత్‌కు అందుతాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
భారత్‌కు అధునాతన గగనతల రక్షణ వ్యవస్థ విక్రయం
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎవరు : అమెరికా
Published date : 11 Feb 2020 05:33PM

Photo Stories