భారత్‌కి చెందిన హర్మన్‌ప్రీత్ సింగ్ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందాడు?
Sakshi Education
టోక్యో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగనున్న భారత పురుషుల హాకీ జట్టును జూన్ 18న హాకీ ఇండియా ప్రకటించింది.
16 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో 10 మంది తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడనున్నారు. 2012 లండన్, 2016 రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న సీనియర్ ప్లేయర్ ఎస్‌వీ సునీల్‌తోపాటు ఆకాశ్‌దీప్ సింగ్, రమణ్‌దీప్ సింగ్‌లకు ఈసారి జట్టులో చోటు లభించలేదు.
భారత పురుషుల హాకీ జట్టు: పీఆర్ శ్రీజేష్, హర్మన్‌ప్రీత్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్, సురేందర్, అమిత్ రోహిదాస్, బీరేంద్ర లక్రా, హార్దిక్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, వివేక్ సాగర్, నీలకంఠ శర్మ, సుమిత్, షంషేర్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్, గుర్జంత్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, మన్‌దీప్ సింగ్.
Published date : 19 Jun 2021 07:25PM