భారతీయుల మెదడు పరిమాణం తక్కువ
Sakshi Education
భారతీయుల మెదడు పరిమాణం చైనీయులు, కొరియన్లు, కాకాసియన్ల కంటే చిన్నదిగా ఉంటుందని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐఐఐటీ) హైదరాబాద్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.
భారతీయుల మెదడు ఆకారం ఇతరుల కంటే భిన్నంగా ఉందని తేలింది. ఈ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు తొలిసారి ‘‘భారతీయుల బ్రెయిన్ అట్లాస్’’ను రూపొందించారు. ఈ అట్లాస్‌ను ఐఐఐటీ హైదరాబాద్‌కు చెందిన పరిశోధకులు జయంత్రి శివస్వామి, అల్ఫిన్ తొట్టుపట్టు అభివృద్ధి చేశారు. తాజా పరిశోధనతో అల్జీమర్స్‌ను, ఇతరత్రా మెదడు సంబంధిత అనారోగ్యాలను తొలిదశల్లోనే గుర్తించే అవకాశం ఉందని పరిశోధకులు వివరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారతీయుల మెదడు పరిమాణం తక్కువ
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : ఐఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు
Published date : 30 Oct 2019 05:39PM