భారతీయ అమెరికన్‌కు జడ్జి పదవి
Sakshi Education
వాషింగ్టన్: ప్రముఖ భారతీయ అమెరికన్ అటార్నీ షిరీన్ మాథ్యూస్‌ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జడ్జిగా నామినేట్ చేశారు.
కాలిఫోర్నియా సదరన్ డిస్ట్రిక్ట్ కోర్టు ఆర్టికల్-3 జడ్జీగా మాథ్యూస్ పేరును అధ్యక్షుడు ప్రతిపాదించినట్లు నేషనల్ ఆసియా పసిఫిక్ అమెరికన్ బార్ అసోసియేషన్ (ఎన్‌ఏపీఏబీఏ) తెలిపింది. ఆమె పేరు ఆమోదం పొందితే షిరీన్ ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందిన మొదటి అమెరికా మహిళగా, భారత సంతతికి చెందిన మొదటి మహిళగా రికార్డు సృష్టిస్తారని పేర్కొంది. జీవిత కాలం ఆమె ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. గతంలో ఆమె అసిస్టెంట్ అటార్నీగా పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: భారతీయ అమెరికన్‌కు జడ్జి పదవి
ఎవరు: అటార్నీ షిరీన్ మాథ్యూస్
ఎక్కడ: కాలిఫోర్నియా
క్విక్ రివ్యూ:
ఏమిటి: భారతీయ అమెరికన్‌కు జడ్జి పదవి
ఎవరు: అటార్నీ షిరీన్ మాథ్యూస్
ఎక్కడ: కాలిఫోర్నియా
Published date : 03 Sep 2019 06:27PM