భారతదేశ సరిహద్దుల్లో చైనా కొత్త రైల్వేలైన్
Sakshi Education
సరిహద్దు విషయంలో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే.. మరోవైపు భారత్‌ను రెచ్చగొట్టే చర్యలకు చైనా పాల్పడుతోంది.
భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి సిద్ధమైంది. సిచువాన్-టిబెట్ రైల్వే మార్గంలో భాగంగా నైరుతి సిచువాన్ ప్రావిన్స్ లోని యాన్ నుంచి టిబెన్‌లోని లింజీ వరకు ఈ కొత్త లైన్ నిర్మిస్తారు. ఇది సరిగ్గా అరుణాచల్ సరిహద్దు నుంచే వెళ్లనుంది.
చెంగ్డూలో మొదలు...
ఈ రైల్వే లైన్‌లో రెండు సొరంగాలు, ఒక బ్రిడ్జి, ఒక విద్యుత్ సరఫరా ప్రాజెక్టు తదితరాలు నిర్మిస్తారు. నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించనున్నాయి. సిచువాన్-టిబెట్ రైల్వే లైన్ చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ రాజధాని చెంగ్డూలో మొదలవుతుంది. లాసాలో ముగుస్తుంది. ఈ రైల్వేలైన్‌తో రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం చాలా తగ్గిపోతుంది.

Published date : 03 Nov 2020 05:45PM