Skip to main content

భారత్ వృద్ధి రేటు తగ్గింపు : ఏడీబీ

2019-20ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధిరేటుఅంచనాలను ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) 7.6 నుంచి 7.2 శాతానికి త గ్గించింది.
అలాగే 2018-19 వృద్ధి అంచనాలను కూడా 7.3 శాతం నుంచి 7 శాతానికి కుదించింది. అంతర్జాతీయంగా ఆర్థిక మందగమన పరిస్థితులు, ఆదాయాల్లో క్షీణత వంటి అంశాలు ఇందుకు కారణమని ఏడీబీ పేర్కొంది. ఈ మేరకు ఏప్రిల్ 3న అవుట్‌లుక్‌ను విడుదల చేసింది.

ఏడీబీ అవుట్‌లుక్‌లోని ముఖ్యాంశాలు...
  • 2020లో వృద్ధి రేటు 7.3 శాతంగా ఉంటుంది.
  • 2019-20లో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుంది.
  • వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 2019-20లో సగటున 4.3 శాతంగా ఉంటే, 2020-21లో 4.6 శాతంగా ఉంటుంది.
  • దక్షిణాసియాలో మందగమన పరిస్థితులు మొత్తం ఆసియాపై ప్రతికూలత చూపవచ్చు.
  • దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం- కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.4 శాతం (జీడీపీ విలువలో పోల్చి), 2020-21లో 2.5 శాతంగా ఉండే అవకాశం ఉంది. - క్యాడ్ సమస్యను భారత్ విజయవంతంగా అధిగమించే అవకాశం ఉంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్ వృద్ధి రేటు 7.6 నుంచి 7.2 శాతానికి తగ్గింపు
ఎప్పుడు : ఏప్రిల్ 3
ఎవరు : ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ)
Published date : 04 Apr 2019 06:01PM

Photo Stories