భారత్ వృద్ధి రేటు 7.3 శాతం : ఐఎంఎఫ్
Sakshi Education
భారత్ వృద్ధి రేటు 2019లో 7.3 శాతంగా, 2020లో 7.5 శాతంగా నమోదవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వె ల్లడించింది.
ఇదే సమయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంగా (2019-20) వృద్ధిరేటు అంచనాలను 7.4 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గించింది. ఈ మేరకు ఏప్రిల్ 9న ఒక నివేదికను విడుదల చేసింది. భారత్ వృద్ధి పటిష్టతకు పెట్టుబడుల్లో వేగవంతమైన రికవరీ, వినియోగ పరిస్థితులు మెరుగుపడుతుండటం వంటి అంశాలు తోడ్పడుతున్నాయని ఐఎంఎఫ్ పేర్కొంది.
ప్రపంచ వృద్ధిరేటు అంచనా తగ్గింపు....
2019లో ప్రపంచ వృద్ధి రేటు అంచనాలను 3.7 శాతం నుంచి 3.3 శాతానికి ఐఎంఎఫ్ తగ్గించింది. అలాగే 2020లో వృద్ధి అంచనాలను కూడా 3.7 శాతం నుంచి 3.6 శాతానికి సవరించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సున్నితమైన పరిస్థితిని ఎదుర్కొంటోందని ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ తెలిపారు.
ఐఎంఎఫ్ నివేదికలోని ముఖ్యాంశాలు...
ఏమిటి : 2019లో భారత్ వృద్ధి రేటు 7.3 శాతం
ఎప్పుడు : ఏప్రిల్ 9
ఎవరు : అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)

- ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది.
- 2018లో భారత్ వృద్ధి రేటు 7.1 శాతం. చైనా 6.6 శాతం వృద్ధిరేటుకన్నా ఇది అధికం. 2019, 2020ల్లో చైనా వృద్ధిరేట్లు వరుసగా 6.3 శాతం, 6.1 శాతం ఉంటాయని భావిస్తున్నాం.
- ఉద్దీపన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, 2019, 2020ల్లో చైనా వృద్ధి నెమ్మదిగానే ఉండే వీలుంది.
- ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడం, దీనితో వడ్డీరేట్ల తగ్గుదల భారత్ వృద్ధి జోరు కారణాల్లో కొన్ని.
- మధ్యకాలికంగా చూస్తే, 7 శాతం స్థాయిలో భారత్ వృద్ధి స్థిరీకరణ పొందే అవకాశం ఉంది. వ్యవస్థాగత సంస్కరణల అమలు, మౌలిక ప్రాజెక్టుల విషయంలో అవరోధాల తొలగింపు ఈ అంచనాలకు కారణం.
- ప్రభుత్వ రుణం తగిన స్థాయిలో ఉంచడం వృద్ధి పటిష్టతకు దోహదపడే అంశాల్లో ఒకటి.
- 2018లో అంతర్జాతీయ వృద్ధి మందగమనంలోకి జారింది. చివరి ఆరు నెలల కాలంలో ఈ పరిస్థితి మరింత క్షీణించింది. చైనా-అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం అంశాలు దీనికి ప్రధాన కారణం.
ఏమిటి : 2019లో భారత్ వృద్ధి రేటు 7.3 శాతం
ఎప్పుడు : ఏప్రిల్ 9
ఎవరు : అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)
Published date : 10 Apr 2019 04:30PM