Skip to main content

భారత్ వృద్ధి రేటు 6.1 శాతం : ఐఎంఎఫ్

భారత్ వృద్ధి రేటు 2019లో 6.1 శాతం, 2020లో 7 శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనా వేసింది. ఈ మేరకు అక్టోబర్ 16న తన అవుట్‌లుక్‌ని వెలువరించింది.
ఈ సందర్భంగా ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ మాట్లాడుతూ... ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు సంబంధించి నికర వ్యత్యాసం ద్రవ్యలోటును భారత్ అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. అయితే దేశ ఆదాయ అంచనాలు కొంత సానుకూలంగానే ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ విభాగం, వినియోగ, లఘు చిన్న మధ్య తరహా పరిశ్రమల రుణాల వంటి అంశాల్లో ఒడిదుడుకులు, సవాళ్లను భారత్ ఎదుర్కొంటోంద న్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
2019 భారత్ వృద్ధి రేటు 6.1 శాతం
ఎప్పుడు : అక్టోబర్ 16
ఎవరు : అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ
Published date : 17 Oct 2019 05:48PM

Photo Stories