Skip to main content

భారత్ వృద్ధి 6.9 శాతమే: ఇండ్-రా

2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఆర్థిక వృద్ధి కేవలం 6.9 శాతంగానే ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్‌‌స అండ్ రీసెర్చ్ (ఇండ్-రా) అంచనావేసింది.
ఈ మేరకు మే 27న ఒక నివేదికను విడుదల చేసింది. అంతర్జాతీయంగా వాణిజ్య పరిస్థితులు తగిన విధంగా లేనప్పటికీ, విధాన, ద్రవ్య పరమైన దేశీయ చర్యల ద్వారా పరిస్థితులను కొంత అధిగమించవచ్చని రా పేర్కొంది. 2018-19లో భారత్ వృద్ధి 7 శాతంగా ఉంటుందని కేంద్ర గణాంకాల కార్యాలయం అంచనా వేసింది. 2017-18లో భారత్ వృద్ధి రేటు 7.2 శాతంగా నమోదైంది.
Published date : 28 May 2019 06:32PM

Photo Stories