Skip to main content

భారత్ వృద్ధి 5.8 శాతమే: మూడీస్

2019-2020 ఆర్థిక సంవత్సరంలో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 5.8 శాతంగానే ఉంటుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అంచనా వేసింది.
గతంలో తాను ప్రకటించిన 6.2 శాతం అంచనాను 5.8 శాతానికి కుదించింది. పెట్టుబడుల మందగమనం దీనితో వినియోగం తగ్గడం, గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యపరమైన ఒత్తిడులు, ఉపాధి కల్పనలో వెనుకబాటు వంటి అంశాలు వృద్ధి రేటు అంచనా తాజా కోతకు కారణమని మూడీస్ అక్టోబర్ 10న పేర్కొంది. అయితే 2020-21లో దేశ జీడీపీ వృద్ధి 6.6 శాతం ఉంటుందని వెల్లడించింది.

భారత్ వృద్ధి 6.1 శాతం : ఇండియా రేటింగ్స్
2019-20లో భారత్ వృద్ధి రేటు 6.1 శాతం ఉంటుందని ఇండియా రేటింగ్‌‌స అండ్ రీసెర్చ్ అంచనావేస్తోంది. బలహీన డిమాండ్ తమ తాజా అంచనాలకు కారణంగా పేర్కొంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
2019-2020 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి 5.8 శాతమే
ఎప్పుడు : అక్టోబర్ 10
ఎవరు : మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్
ఎందుకు : వినియోగం తగ్గడం, గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యపరమైన ఒత్తిడులు వంటి అంశాల కారణంగా
Published date : 11 Oct 2019 04:47PM

Photo Stories