Skip to main content

భారత్ వృద్ధి 4.8 శాతమే : ఐఎంఎఫ్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2019-2020లో భారత్ ఆర్థికవృద్ధి రేటు 4.8 శాతమే నమోదవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనావేసింది. ఇంతక్రితం ఈ వృద్ధి అంచనా 6.1 శాతం.
Current Affairsవరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ (డబ్ల్యూఈఓ) తాజా అంచనాలను ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ జనవరి 20నస్విట్జర్లాండ్‌లోనిదావోస్‌లో వెల్లడించారు. భారత్‌లో గ్రామీణ డిమాండ్ వృద్ధి పడిపోయిందని, బ్యాంకింగ్ రుణ వృద్ధి మందగించిందనీ గీతా పేర్కొన్నారు.  ఆయా కారణాలు భారత్ వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయన్నారు.
 
 2020-21లో 5.8 శాతం..
 2020-21లో భారత్ వృద్ధి 5.8 శాతానికి, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని కూడా ఐఎంఎఫ్ అంచనావేసింది. ఇక 2019లో అంతర్జాతీయ వృద్ధి 2.9 శాతంగా ఉంటుందన్నది ఐఎంఎఫ్ అంచనా. ఇంతక్రితం ఈ అంచనా 3 శాతం. అటుపై రెండు సంవత్సరాల్లో ఈ వృద్ధిరేటు వరుసగా 3.3 శాతం, 3.4 శాతానికి పెరుగుతుందని ఐఎంఎఫ్ తన తాజా అంచనాల్లో పేర్కొంది.

 క్విక్ రివ్యూ   :
 ఏమిటి : 2019-2020లో భారత్ ఆర్థికవృద్ధి రేటు 4.8 శాతమే
 ఎప్పుడు  : జనవరి 20
 ఎవరు  : వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ (డబ్ల్యూఈఓ)
 ఎందుకు :  గ్రామీణ డిమాండ్ వృద్ధి పడిపోవడం, బ్యాంకింగ్ రుణ వృద్ధి మందగించడం వంటి కారణాల వల్ల

మాదిరి ప్రశ్నలు

1. ప్రస్తుతం ఐఎంఎఫ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా ఎవరు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు?
 1. గీతా గోపీనాథ్    
 2. క్రిస్టాలినా జార్జివా
 3. రోడ్రిగో డి రెటో 
 4. హాస్ట్ కోలర్

Published date : 21 Jan 2020 06:15PM

Photo Stories