భారత్ వర్ధమాన దేశం కాదు: ట్రంప్
Sakshi Education
భారత్, చైనాలు ఆసియాలో పెద్ద ఆర్థికశక్తులుగా ఎదిగాయని.. అవి ఇంకా వర్ధమాన దేశాలేమీ కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.
అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఆగస్టు 13న జరిగిన కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ బ్యాంకు ఇచ్చిన ‘వర్ధమాన దేశాల’ హోదా ముసుగులో భారత్, చైనా అక్రమంగా ప్రయోజనాలు పొందుతున్నాయన్నారు. వర్థమాన దేశాలనే హోదాను అడ్డం పెట్టుకుని అమెరికా నుంచి ఏళ్ల తరబడి ప్రయోజనాలు పొందుతూనే ఉన్నాయని విమర్శించారు. ఇకపై మాత్రం అలాంటి దేశాలు అక్రమంగా వర్ధమాన దేశాల హోదాను వాడుకుని అక్రమంగా ప్రయోజనాలు పొందనిచ్చేది లేదని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్, చైనాలు వర్ధమాన దేశాలు కావు
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్, చైనాలు వర్ధమాన దేశాలు కావు
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
Published date : 15 Aug 2019 05:33PM