Skip to main content

భారత టెన్నిస్ దిగ్గజ కోచ్ అక్తర్ అలీ కన్నుమూత

భారత మేటి టెన్నిస్ ప్లేయర్, దిగ్గజ కోచ్ అక్తర్ అలీ(81) కన్నుమూశారు.
Edu news

అనారోగ్యం కారణంగా ఫిబ్రవరి 7న కోల్‌కతాలో తుదిశ్వాస విడిచారు. 1939 జూలై 5న జన్మించిన అక్తర్ అలీ... 1955లో జాతీయ జూనియర్ చాంపియన్‌గా నిలిచారు. 1958 నుంచి 1964 మధ్యకాలంలో అక్తర్ అలీ భారత డేవిస్‌కప్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతోపాటు కెప్టెన్‌గా ఉన్నారు. 1968లో జాతీయ స్క్వాష్ చాంపియన్‌గా నిలిచారు.

భారత జట్టుకు కోచ్‌గా...
ఆటకు వీడ్కోలు పలికిన అక్తర్ అలీ... 1966 నుంచి 1993 వరకు భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. ఆయన కోచ్‌గా ఉన్నపుడే భారత జట్టు రెండుసార్లు (1966, 1974) డేవిస్ కప్‌లో ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచింది. మలేసియా (1968-1970; 1991-1993), బెల్జియం (1980-1984) జట్లకు కూడా కోచ్‌గా వ్యవహరించారు. ఆయన సేవలకు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2000లో అర్జున అవార్డుతో సత్కరించింది. అక్తర్ అలీ తనయుడు జీషాన్ అలీ ప్రస్తుత భారత డేవిస్‌కప్ జట్టు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత మేటి టెన్నిస్ ప్లేయర్, దిగ్గజ కోచ్ కన్నుమూత
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : అక్తర్ అలీ
ఎక్కడ : కోల్‌కతా, పశ్చిమ బెంగాల్
ఎందుకు : అనారోగ్యం కారణంగా

Published date : 09 Feb 2021 06:07PM

Photo Stories