భారత రుణ వృద్ధి 7 శాతం లోపే: ఇక్రా
Sakshi Education
2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో బ్యాంకింగ్ రుణ వృద్ధి కేవలం 6.5 శాతం నుంచి 7 శాతం శ్రేణిలో రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఉంటుందని విశ్లేషించింది.
ఇదే నమోదయితే రుణ వృద్ధిరేటు 58 సంవత్సరాల కనిష్టస్థాయికి పడిపోయినట్లేనని పేర్కొంది. ఈ మేరకు డిసెంబర్ 27న ఒక నివేదికను విడుదల చేసింది. భారత్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనంలో ఉందని ఇక్రా తన నివేదికలో పేర్కొంది. 1962లో భారత రుణ వృద్ధిరేటు 5.4 శాతంగా ఉంది. గడచిన ఆర్థిక సంవత్సరం (2018-19) బ్యాంకింగ్ రుణ వృద్ధి 13.3 శాతంగా నమోదైంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత రుణ వృద్ధి 7 శాతం లోపే
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : రేటింగ్ ఏజెన్సీ ఇక్రా
ఎందుకు : ఆర్థిక మందగమనం కారణంగా
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత రుణ వృద్ధి 7 శాతం లోపే
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : రేటింగ్ ఏజెన్సీ ఇక్రా
ఎందుకు : ఆర్థిక మందగమనం కారణంగా
Published date : 28 Dec 2019 06:05PM