భారత రత్న పురస్కారాల ప్రదానం
Sakshi Education
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, భారతీయ జన సంఘ్ దివంగత నేత నానాజీ దేశ్‌ముఖ్, దివంగత గాయకుడు భూపేన్ హజారికాలకు 2019, జనవరిలో ప్రకటించిన భారత రత్న పురస్కారాలను ఆగస్టు 8న ప్రదానం చేశారు.
రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ అవార్డులను ముఖర్జీకి, హజారికా కొడుకు తేజ్‌కు, నానాజీ సన్నిహిత బంధువు విక్రమజీత్ సింగ్‌కు అందజేశారు.
కాంగ్రెస్‌కు అత్యంత విశ్వాసపాత్రుడైన ప్రణబ్ భారత్‌కు అత్యంత పిన్న వయస్కుడైన ఆర్థిక మంత్రిగా పనిచేశారు. భారత రత్న అందుకున్న ఐదో రాష్ట్రపతిగా ప్రణ్‌బ్ నిలిచారు. నానాజీ దేశ్‌ముఖ్‌కు 1928 నుంచి ఆయన చనిపోయే వరకు ఆరెస్సెస్‌తో సంబంధాలు ఉన్నాయి. భారతీయ జన సంఘ్ స్థాపకుల్లో నానాజీ ఒకరు. కాగా, అస్సాంకు చెందిన హజారికా నేపథ్య గాయకుడు, గేయ రచయిత, సంగీత వాద్యకారుడు, చిత్ర నిర్మాత కూడా. నానాజీ, హజారికాలకు ఈ అవార్డును వారి మరణానంతరం ప్రకటించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, భారతీయ జన సంఘ్ దివంగత నేత నానాజీ దేశ్‌ముఖ్, దివంగత గాయకుడు భూపేన్ హజారికాలకు భారత రత్న పురస్కారాల ప్రదానం
ఎప్పుడు : ఆగ స్టు 8
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : రాష్ట్రపతి భవన్

Published date : 09 Aug 2019 05:56PM