Skip to main content

భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ చాప్‌మన్ కన్నుమూత

భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్, మిడ్ ఫీల్డర్ కార్ల్‌టన్ చాప్‌మన్(49) కన్నుమూశాడు.
Current Affairs
గుండెపోటు కారణంగా బెంగళూరులో అక్టోబర్ 12న తుదిశ్వాస విడిచాడు. 1971, ఏప్రిల్ 13న బెంగళూరులో జన్మించిన చాప్‌మన్ 1995 నుంచి 2001 వరకు భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అతని సారథ్యంలోని టీమిండియా 1997 ‘శాఫ్’ కప్‌ను గెలుచుకుంది.

మాజీ క్రికెటర్ సురేశ్ కన్నుమూత
కేరళకు చెందిన మాజీ రంజీ క్రికెటర్ మణి సురేశ్ కుమార్ (47) ఇకలేరు. అనారోగ్యం కారణంగా కేరళలోని అలప్పూజ(అలెప్పీ)లో అక్టోబర్ 9న తుదిశ్వాస విడిచారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన సురేశ్ 14 ఏళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో కేరళ, రైల్వేస్ జట్ల తరఫున 72 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 27.54 సగటుతో 196 వికెట్లు పడగొట్టారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 12
ఎవరు : కార్ల్‌టన్ చాప్‌మన్(49)
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక
ఎందుకు : గుండెపోటు కారణంగా
Published date : 16 Oct 2020 12:21PM

Photo Stories