Skip to main content

భారత ప్రభుత్వం చేపట్టనున్న ప్రాజెక్ట్ మౌసమ్ ముఖ్య ఉద్దేశం?

సముద్ర మార్గం ఆధారంగా భారతదేశం ఏయే దేశాలతో సంబంధాలు నెరిపిందో చారిత్రక ఆధారాలను వెలికితీయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Current Affairs

ఈ మేరకు సముద్ర తీరం ఉన్న ప్రాంతాల్లో ప్రాజెక్ట్ మౌసమ్’ పేరుతో బృహత్తర అధ్యయనాన్ని నిర్వహించనుంది. ఈ బాధ్యతల్ని ప్రాంతాల వారీగా విభజించి కొందరు నిష్ణాతులకు అప్పగించింది. అందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అధ్యయన బాధ్యతను హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం చరిత్ర విభాగాధిపతి ప్రొఫెసర్ కె.పి.రావుకు అప్పగించింది.

ప్రాజెక్ట్ మౌసమ్-ముఖ్యాంశాలు

  • ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్నోడల్ ఏజెన్సీగా కేంద్ర పర్యాటక శాఖ ప్రాజెక్ట్ మౌసమ్‌కు శ్రీకారం చుట్టింది.
  • సముద్ర మార్గం ద్వారా మన దేశానికి-ఇతర దేశాలకు మధ్య వాణిజ్య, సాంస్కృతిక, విజ్ఞాన సంబంధ బాంధవ్యాలకు సంబంధించిన నాటి చారిత్రక ఆధారాలను ఈ ప్రాజెక్టు ద్వారా వెలికి తీస్తారు.
  • నాటి చారిత్రక వివరాల ఆధారంగా ఆయా దేశాలతో ఇప్పుడు మనదేశం కొత్త మైత్రిని ఎలా పెంపొందించుకోవచ్చని ప్రభుత్వం పరిశీలించనుంది. ఇది మళ్లీ కొత్త వాణిజ్యానికి బాటలు వేస్తుందని కేంద్రం భావిస్తోంది.
  • ఇది వాణిజ్యపరంగా మన దేశానికి ఉపయోగపడొచ్చు.
  • మన తీరప్రాంతాల్లో విలసిల్లిన సంస్కృతి, దానికి గుర్తుగా ఉన్న నిర్మాణాలు, అవి ఇతర దేశాల మైత్రిని ప్రతిఫలించే తీరును వెలికితీసి యునెస్కో ముందు నిలపవచ్చన్న మరో ప్రయత్నాన్ని కూడా కేంద్రం ఈ ప్రాజెక్టు ద్వారా చేస్తోంది.
Published date : 17 Nov 2020 05:24PM

Photo Stories