భారత్-పోర్చుగల్ మధ్య ఏడు ఒప్పందాలు
Sakshi Education
పెట్టుబడులు, రవాణా, ఓడరేవులు, కర్మాగారాలు, మేధో హక్కులు వంటి రంగాల్లో సహకారం అందించుకునేందుకు భారత్, పోర్చుగల్ మధ్య ఏడు ఒప్పందాలు కుదిరాయి.
భారత ప్రధాని నరేంద్ర మోదీతో పోర్చుగీసు అధ్యక్షుడు మార్సెలో రెబెలో డిసౌసా న్యూఢిల్లీలో ఫిబ్రవరి 14న భేటీ అయిన సందర్భంగా ఈ ఒప్పందాలు కుదిరాయి. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా పోర్చుగీసు అధ్యక్షుడు డిసౌసా భారత్‌కు వచ్చారు. పోర్చుగీసు అధ్యక్షుడిగా డిసౌసా భారత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. చివరిసారిగా పోర్చుగీస్ అధ్యక్షుడు భారత్‌ను 2007లో సందర్శించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్-పోర్చుగల్ మధ్య ఏడు ఒప్పందాలు
ఎప్పుడు : ఫిబ్రవరి 14
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ, పోర్చుగీసు అధ్యక్షుడు మార్సెలో రెబెలో డిసౌసా
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : పెట్టుబడులు, రవాణా, ఓడరేవులు, కర్మాగారాలు, మేధో హక్కులు వంటి రంగాల్లో సహకారం అందించుకునేందుకు

Published date : 15 Feb 2020 05:53PM