Skip to main content

భార‌త పీఎంవోను అన్‌ఫాలో చేసిన వైట్‌హౌస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ‘ట్విట్టర్‌’లో భారత ప్రధాని మోదీతో స్నేహానికి ముగింపు పలికారు.
Current Affairs

ట్రంప్‌ ట్విట్టర్‌ ఖాతాను నిర్వహిస్తున్న అధ్యక్షుడి నివాసమైన వైట్‌హౌస్‌ ట్విట్టర్‌లో మోదీని అన్‌ఫాలో చేసింది. రాష్ట్రపతి కోవింద్‌ను, ప్రధాని కార్యాలయం(పీఎంవో), అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని అనుసరించడం మానేసింది. కొన్ని రోజుల క్రితం వరకు మోదీసహా 19 మంది భారతీయులను ట్విట్టర్‌లో ఫాలో అయ్యేది. తాజాగా ఆ సంఖ్య 13కు పడిపోయింది. ఈ 13 మంది అమెరికా పరిపాలనతో సంబంధం ఉన్న భారతీయులు. వైట్‌హౌస్‌ ట్విట్టర్‌ ఖాతాను 2.1కోట్ల ఫాలోవర్లు ఉన్నారు. మూడు వారాల క్రితం మోదీ వైట్‌హౌస్‌ ట్విట్టర్‌ ఖాతాను ఫాలో అవుతున్న తొలి ప్రపంచస్థాయి నాయకుడిగా గుర్తింపు పొందారు. ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి వైట్‌హౌస్‌ మోదీ ట్విట్టర్‌ ఖాతాను అనుసరించడం ప్రారంభించింది.


వైట్‌హౌస్‌ వివరణ

ట్విటర్‌ ఖాతా ఆన్‌ఫాలోకు సంబంధించి ఏప్రిల్ 30న వైట్‌హౌస్‌ వర్గాలు వివరణ ఇచ్చాయి. అమెరికా అధ్యక్షుడు పర్యటించే దేశాలకు చెందిన దేశాధినేతల అధికారిక ట్విటర్‌ ఖాతాలను వైట్‌హౌస్‌ అనుసరించడం సాధారణంగా జరుగుతుంటుందని తెలిపాయి. అధ్యక్షుడి పర్యటనకు మద్దతుగా.. వారి ట్విట్స్‌ను రీట్విట్‌ చేసేందుకు కొద్దికాలం పాటు మాత్రమే ఆ ఖాతాలను ఫాలో అవనున్నట్టు వెల్లడించాయి.అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్ 2020, ఫిబ్రవరి చివరి వారంలో భార‌త పర్యటనకు వచ్చిన విష‌యం తెలిసిందే.
Published date : 30 Apr 2020 07:38PM

Photo Stories