భారత్, న్యూజిలాండ్ ప్రొ హాకీ లీగ్ మ్యాచ్‌లు రద్దు
ఈ విషయాన్ని న్యూజిలాండ్ హాకీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇయాన్ ఫ్రాన్సిస్ ఏప్రిల్ 10న తెలిపారు. న్యూజిలాండ్ ప్రభుత్వం లాక్‌డౌన్ మార్గనిర్దేశకాలను అనుసరించి ప్రస్తుత పరిస్థితుల్లో తాము విదేశాల్లో పర్యటించే అవకాశం లేదని... అందుకే భారత్‌తో జరిగే రెండు ప్రొ హాకీ లీగ్ మ్యాచ్‌లను, చైనాలో మహిళల హాకీ జట్టు పర్యటనను రద్దు చేసుకుంటున్నామని పేర్కొన్నారు.
డోలాయమానంలో టోక్యో ఒలింపిక్స్
2021 ఏడాది జూలై 23కి వాయిదా పడిన ఒలింపిక్స్ అప్పుడైనా సరైన సమయంలో జరుగుతాయనే హామీ ఇవ్వలేమని టోక్యో ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) తోషిరో ముటో చెప్పారు. దీంతో 2021 ఒలింపిక్స్ క్రీడల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్, న్యూజిలాండ్ ప్రొ హాకీ లీగ్ మ్యాచ్‌లు రద్దు
ఎప్పుడు : ఏప్రిల్ 10
ఎవరు : న్యూజిలాండ్ హాకీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇయాన్ ఫ్రాన్సిస్
ఎక్కడ : భువనేశ్వర్, ఒడిశా, భారత్
ఎందుకు : కోవిడ్-19 కారణంగా