భారత్ నుంచి 2.9 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్ డోసులు
Sakshi Education
కోవిడ్–19 పేషెంట్లకు వినియోగించేందుకు భారత్ నుంచి 2.9 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్ డోస్‌లను కొనుగోలు చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
‘భారత ప్రధాని మోదీతో మాట్లాడాను. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను పంపగలరా? అని అడిగాను. ఆయన చాలా గొప్పవాడు. చాలా మంచివాడు’ అని ఫాక్స్ న్యూస్‌తో ఏప్రిల్ 8న ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికాకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఎగుమతి చేసేందుకు భారత్ ఏప్రిల్ 7న అంగీకరించిన విషయం తెలిసిందే.
వూహాన్‌లో లాక్‌డౌన్ ఎత్తివేత
కరోనా వైరస్ పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలోని వూహాన్ నగరంలో 76 రోజుల తర్వాత లాక్‌డౌన్‌ను ఎత్తివేశారు. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో వూహాన్‌లో జనవరి 23వ తేదీ నుంచి లాక్‌డౌన్ ప్రకటించారు. తాజాగా లాక్‌డౌన్‌పై ఉన్న అన్ని రకాల ఆంక్షలను ఎత్తివేయడంతో వూహాన్ ప్రజలు బయట ప్రాంతాలకు వెళ్లడం మొదలుపెట్టారు.

Published date : 09 Apr 2020 06:41PM