Skip to main content

భార‌త్ నిర్ణయం భేష్‌ : డబ్ల్యూహెచ్‌ఓ

లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తూ భార‌త ప్రధాని న‌రేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రశంసించింది.
Current Affairs‘భారత్‌లో కరోనా కేసులు ఎంతవరకు తగ్గుముఖం పడతాయో ఇప్పట్నుంచో చెప్పలేంగానీ దేశం ఆరువారాల పాటు లాక్‌డౌన్‌లో ఉండడం వల్ల ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తారని, దీని వల్ల వ్యాప్తిని నిరోధించవచ్చు’అని డబ్ల్యూహెచ్‌ఓ ఆగ్నేయాసియా రీజనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పూనమ్‌ ఖేత్రాపాల్‌ సింగ్ ఏప్రిల్ 14న అన్నారు. ఎన్నో రకాల సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ కోవిడ్‌ను ఎదుర్కోవడంలో భారత్‌ అద్భుతమైన పోరాటపటిమను ప్రదర్శిస్తోందని ఆమె కొనియాడారు.

హాకీ చాంపియ‌న్‌షిప్‌లు వాయిదా..
కోవిడ్‌-19 లాక్‌డౌన్ పొడిగింపుతో హాకీ ఇండియా (హెచ్ఐ) మ‌రోసారి జాతీయ చాంపియ‌న్‌షిప్‌ల‌న్నీ నిర‌వ‌ధికంగా వాయిదా వేసింది. ప్లేయ‌ర్లు, కోచ్‌లు, నిర్వాహ‌కుల ఆరోగ్యాల‌ను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్ఐ ముస్తాక్ అహ్మద్ తెలిపారు.
Published date : 15 Apr 2020 07:04PM

Photo Stories