భారత్, నేపాల్ మధ్య కొత్త చెక్‌పోస్ట్ ప్రారంభం
Sakshi Education
భారత్-నేపాల్ సరిహద్దుల్లో భారత్ సాయంతో నేపాల్ నిర్మించిన ‘జోగ్‌బని-బిరాట్‌నగర్’ ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్ ప్రారంభమైంది.
ఈ చెక్‌పోస్ట్‌ను వీడియో లింక్ ద్వారా జనవరి 21న ఇరుదేశాల ప్రధానులు నరేంద్ర మోదీ, కేపీ శర్మ ఓలి సంయుక్తంగా ప్రారంభించారు. ద్వైపాక్షిక వాణిజ్య వృద్ధి, ఇరుదేశాల ప్రజల మధ్య ప్రత్యక్ష సంబంధాలు లక్ష్యంగా ఈ చెక్‌పోస్ట్‌ను రూపొందించారు. 260 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ చెక్‌పోస్ట్ నిర్మాణం కోసం భారత్ రూ. 140 కోట్ల ఆర్థిక సాయాన్ని నేపాల్‌కు అందించింది.
చెక్‌పోస్ట్ ప్రారంభించిన అనంతరం మోదీ మాట్లాడుతూ.. స్నేహపూర్వక పొరుగు దేశాలతో సత్సంబంధాలకు భారత్ కట్టుబడి ఉందన్నారు. ఆ దేశాలతో వాణిజ్య, సాంస్కృతిక, విద్యావిషయక సంబంధాలు మెరుగుపడే దిశగా భారత్ చర్యలు తీసుకోవడం కొనసాగిస్తుందన్నారు. భారత ప్రధానికి నేపాల్ పీఎం కేపీ శర్మ ఓలి కృతజ్ఞతలు తెలిపారు. మోదీని నేపాల్‌లో పర్యటించాల్సిందిగా ఆహ్వానించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్-నేపాల్ సరిహద్దుల్లో ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్ ప్రారంభం
ఎప్పుడు : జనవరి 21
ఎవరు : నరేంద్ర మోదీ, కేపీ శర్మ ఓలి
ఎక్కడ : జోగ్‌బని-బిరాట్‌నగర్
ఎందుకు : ద్వైపాక్షిక వాణిజ్య వృద్ధి, ఇరుదేశాల ప్రజల మధ్య ప్రత్యక్ష సంబంధాలు లక్ష్యంగా

Published date : 22 Jan 2020 06:22PM