Skip to main content

భారత నౌకాదళంలో చేరిన యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ కవరట్టిని తయారు చేసిన సంస్థ?

ప్రాజెక్ట్-28లో భాగంగా మేకిన్ ఇండియా పిలుపు మేరకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ కవరట్టి.. భారత నౌకాదళ అమ్ముల పొదిలో చేరింది.
Edu news విశాఖలోని నేవల్ డాక్ యార్డులో అక్టోబర్ 22న జరిగిన నౌక కమిషనింగ్ కార్యక్రమం సందర్భంగా ఐఎన్‌ఎస్ కవరట్టిని నావికాదళంలో ప్రవేశపెట్టారు. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే, తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్ జైన్ చేతుల మీదుగా కవరట్టిని జాతికి అంకితం చేశారు.
 
 గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్...
 కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ సంస్థ కవరట్టిని అభివృద్ధి చేసింది. ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా రూపొందిన కవరట్టి.. న్యూక్లియర్, బయో, కెమికల్ ఇలా ఏ తరహా యుద్ధ వాతావరణంలోనైనా శత్రుదేశాలపై విరుచుకుపడుతుందని వైస్ అడ్మిరల్ జైన్ చెప్పారు.
 క్విక్ రివ్యూ   :
 ఏమిటి :
భారత నౌకాదళ అమ్ముల పొదిలోకి ఐఎన్‌ఎస్ కవరట్టి  యుద్ధ నౌక
 ఎప్పుడు  : అక్టోబర్ 22
 ఎవరు  : చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే, తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్ జైన్
 ఎక్కడ  : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
Published date : 23 Oct 2020 06:25PM

Photo Stories