Skip to main content

భారత నావికా దళ మారిటైమ్ మిషన్లలో చేరనున్న మొదటి ముగ్గురు మహిళలు?

తొలిసారిగా ముగ్గురు మహిళా పైలట్లు నావికా దళంలో మారిటైమ్ రికానెజైన్స్ మిషన్లలో చేరేందుకు రంగం సిద్ధమైంది.
Edu news‘‘లెఫ్టినెంట్ దివ్యా శర్మ, లెఫ్టినెంట్ శుభాంగి స్వరూప్, లెఫ్టినెంట్ శివాంగి పైలట్ శిక్షణ పూర్తి చేసుకున్నారు. 27వ డోర్నియర్ ఆపరేషనల్ ఫ్లయింగ్ ట్రైనింగ్(డీఓఎఫ్‌టీ) కోర్సును ఈ ముగ్గురు పూర్తిచేశారు. వీరు ఇకపై డోర్నియర్ విమానాలను నడుపుతూ సదరన్ నావల్ కమాండ్‌కు చెందిన మారిటైమ్ రికానెజైన్స్(ఎంఆర్) మిషన్లలో పాలుపంచుకుంటారు’’ అని భారత రక్షణ శాఖ అక్టోబర్ 22న తెలిపింది. లెఫ్టినెంట్ దివ్యా శర్మ స్వస్థలం ఢిల్లీలోని మాలవ్యా నగర్. లెఫ్టినెంట్ శుభాంగి స్వరూప్ ఉత్తరప్రదేశ్‌లోని తిహార్ పట్టణవాసి. ఇక లెఫ్టినెంట్ శివాంగి సొంత ఊరు బిహార్‌లోని ముజఫర్‌పూర్.
 క్విక్ రివ్యూ   :
 ఏమిటి :
నావికా దళంలో మారిటైమ్ రికానెజైన్స్ మిషన్లలో చేరనున్న మహిళా పైలట్లు
 ఎప్పుడు  : అక్టోబర్ 22
 ఎవరు  : లెఫ్టినెంట్ దివ్యా శర్మ, లెఫ్టినెంట్ శుభాంగి స్వరూప్, లెఫ్టినెంట్ శివాంగి 
Published date : 23 Oct 2020 06:29PM

Photo Stories