Skip to main content

భారత మాజీ ఫుట్‌బాలర్‌ షాహిద్‌ హకీమ్‌ కన్నుమూత

హైదరాబాద్‌ నగరానికి చెందిన ప్రముఖ ఫుట్‌బాలర్, 1960 రోమ్‌ ఒలింపిక్స్‌లో భారత జట్టు సభ్యుడిగా ఉన్న సయ్యద్‌ షాహిద్‌ హకీమ్‌(82) కన్నుమూశారు.
డెంగీ సోకడంలో ఆయనను గుల్బర్గాలోని ఓ ఆస్పత్రిలో చేర్చగా, చికిత్స పొందుతుండగానే గుండెపోటుతో ఆగస్టు 22న తుదిశ్వాస విడిచారు. భారత ఫుట్‌బాల్‌లో దిగ్గజ కోచ్‌ అయిన ఎస్‌ఏ రహీమ్‌ కుమారుడైన హకీమ్‌... 25 ఏళ్ల పాటు ఆటతో తన అనుబంధాన్ని కొనసాగించారు. ఆటకు అందించిన సేవలకుగాను 2017లో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘ధ్యాన్‌చంద్‌ అవార్డు’ అవార్డును ఆయన అందుకున్నారు.
శిక్షకుడిగా మంచి గుర్తింపు...
– తండ్రి రహీమ్‌ అడుగుజాడల్లో ఫుట్‌బాల్‌లోకి అడుగు పెట్టిన హకీమ్‌... సెంట్రల్‌ మిడ్‌ఫీల్డర్‌గా, హాఫ్‌ బ్యాక్‌ స్థానంలో తన ప్రతిభను ప్రదర్శించారు.
– హకీమ్‌ అద్భుత ప్రదర్శనతోనే హైదరాబాద్‌ జట్టు 1956, 1957లలో వరుసగా రెండు సార్లు ప్రఖ్యాత సంతోష్‌ ట్రోఫీని గెలుచుకుంది.
– 1950వ, 60వ దశకాల్లో భారత కీలక ఆటగాడిగా నిలిచిన ఆయన.. 1960 రోమ్‌ ఒలింపిక్స్‌లో ఆరో స్థానంలో నిలిచిన మన టీమ్‌లో భాగంగా ఉన్నారు.
– రిటైర్మెంట్‌ తర్వాత... 1989 వరకు 33 అంతర్జాతీయ మ్యాచ్‌లకు రిఫరీగా వ్యవహరించారు.
– కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన హకీమ్‌... శిక్షణలోనే మహీంద్రా అండ్‌ మహీంద్రా జట్టు 1988లో ఈస్ట్‌ బెంగాల్‌ను ఓడించి ప్రతిష్టాత్మక డ్యురాండ్‌ కప్‌ను గెలుకుకుంది.
– సాల్గావ్‌కర్, బెంగా>ల్‌ ముంబై ఎఫ్‌సీ జట్లకు కూడా కోచ్‌గా వ్యవహరించారు.
– 1982లో ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత జట్టుకు అసిస్టెంట్‌ కోచ్‌గా పని చేశారు.
– స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌)లో రీజినల్, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా దశాబ్ద కాలం పాటు సేవలందించారు.

క్విక్రివ్యూ :
ఏమిటి : భారత మాజీ ఫుట్‌బాలర్‌ కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 22
ఎవరు : సయ్యద్‌ షాహిద్‌ హకీమ్‌(82)
ఎక్కడ : గుల్బర్గా(కలబురగి), గుల్బర్గా జిల్లా, కర్ణాటక
ఎందుకు : గుండెపోటు కారణంగా...
Published date : 24 Aug 2021 02:22PM

Photo Stories