Skip to main content

భారత మాజీ క్రికెటర్ మాధవ్ ఆప్టే కన్నుమూత

భారత మాజీ క్రికెటర్ మాధవ్ ఆప్టే(86) సెప్టెంబర్ 23న ముంబైలో కన్నుమూశారు.
1952-53 మధ్య కాలంలో ఓపెనర్‌గా 7 టెస్టులు ఆడిన ఆప్టే 49.27 సగటుతో 542 పరుగులు చేశారు. అలాగే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 67 మ్యాచ్‌లలో 38.79 సగటుతో 3336 పరుగులు సాధించారు. 70 ఏళ్ల వయసు వచ్చే వరకు ముంబైలోని ప్రఖ్యాత ‘కంగా లీగ్’ పోటీల్లో ఆయన ఆడారు. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా పని చేసిన ఆప్టే... 14 ఏళ్ల వయస్సులోనే సచిన్ టెండూల్కర్ ప్రతిభను గుర్తించి తమ క్లబ్ తరఫున ఆడే అవకాశం కల్పించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
భారత మాజీ క్రికెటర్ కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 23
ఎవరు : మాధవ్ ఆప్టే(86)
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
Published date : 24 Sep 2019 05:41PM

Photo Stories