భారత్ లో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్
Sakshi Education
బ్రిటన్ లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ పై మూడో దశ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు పుణేలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ)కు అనుమతి ఇవ్వాలని కోవిడ్‌పై ఏర్పాటైన నిపుణుల కమిటీ జూలై 31న డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు సిఫార్సు చేసింది.
హ్యూమన్ ట్రయల్స్ అనుమతి కోరుతూ సీరమ్ సంస్థ నిపుణుల కమిటీకి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 17 ప్రాంతాల్లో 1,600 మందిపై ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ను పరీక్షిస్తామని సీరమ్ కంపెనీ తెలిపింది. ఇందులో విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ కూడా ఉంది.
పొగాకు నుంచి వ్యాక్సిన్
పొగాకు ఆకుల నుంచి సంగ్రహించిన ప్రొటీన్తో వ్యాక్సిన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు బ్రిటిష్ అమెరికన్ పొగాకు సంస్థ లూసీ స్ట్రైక్స్ సిగరెట్స్ తెలిపింది. ఆ కంపెనీకి చెందిన కెంటకీబయో ప్రాసెసింగ్ తయారు చేస్తున్న వాక్సిన్ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్ లో ఆక్స్‌ఫర్డ్ కరోనావ్యాక్సిన్ ట్రయల్స్
ఎప్పుడు : జూలై 31
ఎవరు : కోవిడ్‌పై ఏర్పాటైన నిపుణుల కమిటీ

Published date : 02 Aug 2020 10:34AM