భారత్ క్రెడిట్ రేటింగ్‌ను తగ్గించిన మూడీస్
Sakshi Education
అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ భారత క్రెడిట్ రేటింగ్ అవుట్‌లుక్ (దృక్పథాన్ని)ను స్థిరం (స్టేబుల్) నుంచి ప్రతికూలానికి (నెగెటివ్) తగ్గించింది.
ఇదే సమయంలో విదేశీ కరెన్సీ రేటింగ్‌ను మార్చకుండా ‘బీఏఏ2 మైనస్’గానే కొనసాగించింది. ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) 3.7 శాతంగా ఉంటుందని మూడీస్ అంచనా వేసింది. ఈ మేరకు నవంబర్ 8న ఒక నివేదికను విడుదల చేసింది. ఫిచ్ రేటింగ్‌స, ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్‌స మాత్రం ఇప్పటికీ భారత అవుట్‌లుక్‌ను స్థిరంగానే (స్టేబుల్)గానే కొనసాగిస్తున్నాయి.
మూడీస్ నివేదికలోని అంశాలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్ క్రెడిట్ రేటింగ్ తగ్గింపు
ఎప్పుడు : నవంబర్ 8
ఎవరు : అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్
మాదిరి ప్రశ్నలు
1. భారత్ ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) 3.7 శాతంగా ఉంటుందని ఏ సంస్థ ఇటీవల అంచనా వేసింది?
1. ఐఎంఎఫ్
2. ఫిచ్ రేటింగ్స్
3. మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్
4. ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్
సమాధానం : 3
మూడీస్ నివేదికలోని అంశాలు
- ఆర్థిక రంగ బలహీనతలను సరిదిద్దే విషయంలో భారత ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించలేకపోయింది. దీంతో సమస్యలు పెరిగాయని, ఫలితంగా వృద్ధి రేటు ఇక ముందూ తక్కువగానే ఉంటుంది.
- అవుట్‌లుక్‌ను నెగెటివ్‌కు మార్చడం పెరిగిన రిస్క్‌లను తెలియజేస్తుంది.
- ఆర్థిక వృద్ధికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే చర్యలు మందగమనం తీవ్రత, కాల వ్యవధిని తగ్గించొచ్చు.
- గ్రామీణ స్థాయిలో దీర్ఘకాలం పాటు ఆర్థిక ఒత్తిళ్లు, ఉపాధి కల్పన బలహీనంగా ఉండటం, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో (ఎన్‌బీఎఫ్‌ఐ) రుణ సంక్షోభంతో మందగమనం మరింత స్థిరపడే అవకాశాలున్నాయి.
- ఎన్‌బీఎఫ్‌ఐల్లో రుణ సంక్షోభం వేగంగా పరిష్కారం కాకపోవచ్చు.
- ఆర్‌బీఐ రేట్ల తగ్గింపు సహా ఇటీవలి కాలంలో తీసుకున్న చర్యలు ఆర్థిక రంగానికి మద్దతునిస్తాయే గానీ, ఉత్పాదకత, వాస్తవ జీడీపీ వృద్ధి పూర్వపు స్థాయికి తీసుకెళ్లలేకపోవచ్చు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్ క్రెడిట్ రేటింగ్ తగ్గింపు
ఎప్పుడు : నవంబర్ 8
ఎవరు : అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్
మాదిరి ప్రశ్నలు
1. భారత్ ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) 3.7 శాతంగా ఉంటుందని ఏ సంస్థ ఇటీవల అంచనా వేసింది?
1. ఐఎంఎఫ్
2. ఫిచ్ రేటింగ్స్
3. మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్
4. ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్
సమాధానం : 3
Published date : 09 Nov 2019 05:57PM