Skip to main content

భారత కంపెనీలు ఏ దేశంలో అత్యధిక పెట్టుబడులను పెట్టాయి?

విదేశాల్లో భారత కంపెనీల పెట్టుబడులు పెరుగుతున్నాయి.
Current Affairs ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) ఎనిమిది నెలల కాలంలో భారత కంపెనీలు విదేశాల్లో 1,225 కోట్ల డాలర్ల మేర ఇన్వెస్ట్ చేశాయి. కేర్ రేటింగ్స్ డిసెంబర్ 18న విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

నివేదికలోని ముఖ్యాంశాలు
  • భారత కంపెనీలు అత్యధికంగా అమెరికాలో 236 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాయి.
  • అమెరికా తర్వాత సింగపూర్‌లో 207 కోట్ల డాలర్లు, నెదర్లాండ్‌‌సలో 150 కోట్ల డాలర్లు, బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్‌‌సలో 137 కోట్ల డాలర్లు, మారిషస్‌లో 130 కోట్ల డాలర్లు చొప్పున పెట్టుబడులు పెట్టాయి. భారత కంపెనీలు విదేశాల్లో ఇన్వెస్ట్ చేసిన నిధుల్లో దాదాపు 70 శాతం వాటా ఈ ఐదు దేశాలదే.
  • కంపెనీల పరంగా అత్యధికంగా విదేశాల్లో ఇన్వెస్ట్ చేసిన కంపెనీగా ఓఎన్‌జీసీ విదేశ్ (185 కోట్ల డాలర్లు) నిలిచింది.
  • ఓఎన్‌జీసీ తర్వాతి స్థానాల్లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్(87 కోట్ల డాలర్లు), హల్దియా పెట్రోకెమికల్స్(60 కోట్ల డాలర్లు) ఉన్నాయి.
  • 2008-09 ఆర్థిక సంవత్సరంలో మన కంపెనీలు అత్యధికంగా 1,900 కోట్ల డాలర్లు విదేశాల్లో ఇన్వెస్ట్ చేశాయి.
Published date : 19 Dec 2020 07:38PM

Photo Stories