భారత జలాల్లో చైనా నౌక : నేవీ చీఫ్
Sakshi Education
భారత సముద్ర జలాల మీద తిరుగుతున్న చైనా నౌకను తిప్పిపంపినట్లు నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ తెలిపారు.
చైనాకు చెందిన షియాన్ 1 నౌక భారత ఆధీనంలోని అండమాన్ సముద్ర జలాలపై పరిశోధనలు చేస్తున్నట్లు తాము గుర్తించినట్లు చెప్పారు. పరిశోధనలకు సంబంధించిన వివరాలను తమకు అందించలేదని, తమ అనుమతి లేకుండానే నిషేధిత ప్రాంతంలో ప్రవేశించినట్లు పేర్కొన్నారు. దాదాపు 7 నుంచి 8 చైనా నౌకలు ఆయా ప్రాంతాల్లో ఉన్నట్లు వివరించారు. సముద్రజలాలపై చైనాకు చెక్ పెట్టేందుకు శ్రీలంక, మాల్దీవులు, ఇండోనేషియా, థాయ్‌లాండ్ వంటి దేశాలతో కలసి పనిచేసేందుకు భారత్ కృషిచేస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత జలాల్లో చైనా నౌక
ఎప్పుడు : డిసెంబర్ 3
ఎవరు : నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్
ఎక్కడ : భారత ఆధీనంలోని అండమాన్ సముద్ర జలాలపై
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత జలాల్లో చైనా నౌక
ఎప్పుడు : డిసెంబర్ 3
ఎవరు : నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్
ఎక్కడ : భారత ఆధీనంలోని అండమాన్ సముద్ర జలాలపై
Published date : 04 Dec 2019 05:39PM