భారత్ జీడీపీ వృద్ధిరేటు 5.1 శాతమే : క్రిసిల్
Sakshi Education
భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 2019-20 ఆర్థిక సంవత్సరం అంచనాలను రేటింగ్‌స ఏజెన్సీ క్రిసిల్ తగ్గించింది. ఇంతక్రితం 6.3 శాతం ఉన్న ఈ రేటును 5.1 శాతానికి తగ్గిస్తున్నట్లు డిసెంబర్ 2న ప్రకటించింది.
దేశంలో ఊహించినదానికన్నా మందగమన తీవ్రత ఎక్కువగా ఉందనీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్-సెప్టెంబర్) 4.75 శాతం వృద్ధి రేటు నమోదయితే, చివరి ఆరు నెలల్లో (అక్టోబర్-మార్చి) మాత్రం వృద్ధిరేటు కొంత మెరుగ్గా 5.5 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
సమీప భవిష్యత్తులో బలహీనమే: డీఅండ్‌బీ
అమెరికా ఆర్థిక గణాంకాల ప్రచురణ సంస్థ- డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ (డీఅండ్‌బీ) మరో నివేదికను విడుదల చేస్తూ, సమీప భవిష్యత్తులో భారత్ ఆర్థిక వృద్ధి బలహీనంగానే ఉంటుందని విశ్లేషించింది. ఊహించినదానికన్నా మందగమనం కొంత ఎక్కువకాలమే కొనసాగే అవకాశం ఉందనీ అభిప్రాయపడింది. ఇటీవల వచ్చిన వరదలు, తగ్గిన వ్యవసాయ ఉత్పత్తి వంటి అంశాలు గ్రామీణ ప్రాంతాల డిమాండ్‌ను దెబ్బతీసిందని పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ వృద్ధిరేటు 5.1 శాతమే
ఎప్పుడు : డిసెంబర్ 2
ఎవరు : రేటింగ్‌స ఏజెన్సీ క్రిసిల్
ఎందుకు : దేశంలో మందగమన తీవ్రత ఎక్కువగా ఉన్నందున

Published date : 03 Dec 2019 06:08PM