Skip to main content

భారత్ జీడీపీ వృద్ధి రేటు 7.5 శాతం

2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 7.5 శాతంగా నమోదవుతుందని ప్రపంచబ్యాంక్ తెలిపింది.
ఈ మేరకు ఏప్రిల్ 8న ఒక నివేదికను విడుదల చేసింది. దేశంలో పెట్టుబడుల పరిస్థితి పటిష్టం అవుతోందని, ఎగుమతులు మెరుగుపడుతున్నాయని, వినియోగ పరిస్థితులు బాగున్నాయని ప్రపంచబ్యాంక్ ఈ నివేదికలో పేర్కొంది.

నివేదికలోని ముఖ్యాంశాలు...
  • 2018-2019లో భారత్ వృద్ధి రేటు 7.2 శాతంగా అంచనా.
  • వ్యవసాయ రంగం 4 శాతం వృద్ధి మంచి ఫలితమే.
  • ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా 4 శాతంలోపే ఉంటుందని భావించడం జరుగుతోంది.
  • దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్య మధ్య నికర వ్యత్యాసం- కరెంట్ అకౌంట్‌లోటు, అలాగే ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం- ద్రవ్యలోటు అదుపులోనే ఉన్నాయి.
  • ఎగుమతులు పెరుగుతుండడం, తక్కువ ముడి చమురు దిగుమతుల వల్ల దేశానికి తగ్గే చమురు బిల్లు భారం కరెంట్ అకౌంట్ లోటును 1.9 శాతానికి (2019-20 జీడీపీ విలువలో) కట్టడిచేసే అవకాశంఉంది. అలాగే ద్రవ్యలోటు 3.4 శాతం దాటకపోవచ్చు.

2019-20 వృద్ధి రేటుపై అంచనా (శాతాల్లో)

ఆర్‌బీఐ

7.2

ఏడీబీ

7.2

ప్రపంచబ్యాంక్

7.5

ఐఎంఎఫ్

6.8

ఫిచ్

6.8

క్విక్ రివ్యూ :
ఏమిటి :
2019-20లో భారత్ జీడీపీ వృద్ధి రేటు 7.5 శాతం
ఎప్పుడు : ఏప్రిల్ 8
ఎవరు : ప్రపంచబ్యాంక్
Published date : 09 Apr 2019 05:05PM

Photo Stories