భారత జీడీపీ వృద్ధి రేటు 6 శాతం: ఎస్‌అండ్‌పీ
Sakshi Education
2020-2021లో భారతదేశ వాస్తవిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6 శాతంగా ఉంటుందని గ్లోబల్ దిగ్గజ రేటింగ్ సంస్థ- స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్‌అండ్‌పీ) అంచనావేసింది.
2021-2022లో ఈ రేటు 7 శాతానికి, అటుపై ఆర్థిక సంవత్సరం 7.4 శాతానికి పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ అంచనాల నేపథ్యంలో దీర్ఘకాలికంగా భారత్ సార్వభౌమ రేటింగ్‌ను స్టేబుల్ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ-’గా కొనసాగిస్తున్నట్లు ఎస్‌అండ్‌పీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఫిబ్రవరి 13న ఒక ప్రకటన విడుదల చేసింది. ఒక కంపెనీ లేక దేశం తన ద్రవ్య బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించగలదని ‘బీబీబీ’ రేటింగ్ సూచిస్తుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2020-2021లో భారతజీడీపీ వృద్ధి రేటు 6 శాతం
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎవరు : స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్‌అండ్‌పీ)
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2020-2021లో భారతజీడీపీ వృద్ధి రేటు 6 శాతం
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎవరు : స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్‌అండ్‌పీ)
Published date : 14 Feb 2020 05:43PM