భారత ఇంజనీర్‌కు కామన్వెల్త్ ఇన్నోవేషన్ అవార్డు
Sakshi Education
భారత్‌కి చెందిన ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ నితేశ్‌కుమార్ జాంగిర్‌కు కామన్వెల్త్ సెక్రెటరీ జనరల్ ఇన్నోవేషన్ ఫర్ సస్టయినబుల్ డెవల్‌పమెంట్-2019 అవార్డు లభించింది.
లండన్‌లో జూన్ 18న జరిగిన కార్యక్రమంలో బ్రిటన్ యువరాజు హ్యారీ చేతులమీదుగా నితేశ్ ఈ అవార్డును అందుకున్నారు. ‘కంటిన్యుయస్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెషర్’(సీపీఏపీ) పరికరాన్ని ఆవిష్కరించినందుకుగాను నితేశ్‌కు ఈ అవార్డు దక్కింది. ఆస్పత్రుల్లో ఐసీయూ వసతి లేక.. శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందితో ఏటా లక్షలాది మంది నవజాత శిశువులు పుట్టిన కొన్ని గంటల్లోనే కన్నుమూస్తున్నారు. ఈ మరణాలు తగ్గించేందుకు సీపీఏపీని ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కామన్వెల్త్ సెక్రెటరీ జనరల్ ఇన్నోవేషన్ ఫర్ సస్టయినబుల్ డెవల్‌పమెంట్-2019 అవార్డు
ఎప్పుడు : జూన్ 18
ఎవరు : భారత ఇంజనీర్ నితేశ్‌కుమార్ జాంగిర్
ఎందుకు : కంటిన్యుయస్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెషర్ (సీపీఏపీ) పరికరాన్ని ఆవిష్కరించినందుకుగాను

Published date : 19 Jun 2019 06:12PM