భారత హాకీ కోచ్‌గా గ్రాహం రీడ్
Sakshi Education
భారత పురుషుల హాకీ జట్టు కొత్త కోచ్‌గా ఆస్ట్రేలియాకి చెందిన గ్రాహం రీడ్ ఎంపికయ్యారు.
ఈ మేరకు2020 ఏడాది వరకు రీడ్ కోచ్ పదవిలోకొనసాగుతారని ఇండియా (హెచ్‌ఐ) ఏప్రిల్ 8న ప్రకటించింది. హాకీ ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు పరాజయం అనంతరం హరేంద్ర సింగ్‌ను అనూహ్యంగా తప్పించిన తర్వాత కోచ్ పదవి ఖాళీగా ఉంది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్‌కు చెందిన 54 ఏళ్ల గ్రాహం రీడ్ 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన జట్టులో సభ్యుడి గా ఉన్నాడు. నాలుగు సార్లు చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న టీమ్‌లో కూడా ఆయన భాగంగా ఉన్నారు. డిఫెండర్, మిడ్‌ఫీల్డర్‌గా 130 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 36 గోల్స్ చేసిన రీడ్ 2009లో కోచింగ్‌లో అడుగు పెట్టాడు. గత ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన నెదర్లాండ్‌స టీమ్‌కు కూడా రీడ్ అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత పురుషుల హాకీ జట్టు కొత్త కోచ్ ఎంపిక
ఎప్పుడు : ఏప్రిల్ 8
ఎవరు : గ్రాహం రీడ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత పురుషుల హాకీ జట్టు కొత్త కోచ్ ఎంపిక
ఎప్పుడు : ఏప్రిల్ 8
ఎవరు : గ్రాహం రీడ్
Published date : 09 Apr 2019 05:14PM