భారత్ ఎన్‌పీటీపై సంతకం చేయాలి : చైనా
Sakshi Education
అణు సరఫరాదారుల గ్రూప్(ఎన్‌ఎస్‌జీ)లో సభ్యత్వం కావాలంటే భారత్ అణు నిరాయుధీకరణ ఒప్పందం(ఎన్‌పీటీ)పై సంతకం చేయాల్సిందేనని చైనా స్పష్టం చేసింది.
ఎన్‌పీటీపై సంతకం చేయనందున భారత్ చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. అణు నిరాయుధీకరణ, అణు సాంకేతికతను శాంతియుత ప్రయోజనానికి వాడటం తదితర అంశాలపై అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ లు బీజింగ్‌లో సమావేశమయ్యాయి. ఈ భేటీ ముగిసిన నేపథ్యంలో జనవరి 31న చైనా ఈ విషయం తెలిపింది.
Published date : 01 Feb 2019 05:11PM